ఏపీ మాజీ మంత్రి భర్తపై హైదరాబాద్‌లో మరో కేసు… ఎందుకో తెలుసా?

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే భార్గవరామ్‌పై రెండు కేసులున్నాయి. ఈ రెండు కేసుల్లో ఆయన తప్పించుకుని తిరుగుతున్నందున ఆయనను పట్టుకునేందుకు సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు ఆళ్ళగడ్డ ఎస్‌ఐ. అయితే గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద ఏపీ పోలీసులను చూడగానే .. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:55 pm, Tue, 8 October 19
ఏపీ మాజీ మంత్రి భర్తపై హైదరాబాద్‌లో మరో కేసు... ఎందుకో తెలుసా?

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే భార్గవరామ్‌పై రెండు కేసులున్నాయి. ఈ రెండు కేసుల్లో ఆయన తప్పించుకుని తిరుగుతున్నందున ఆయనను పట్టుకునేందుకు సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు ఆళ్ళగడ్డ ఎస్‌ఐ.

అయితే గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద ఏపీ పోలీసులను చూడగానే .. తన కారును ఆపినట్టే ఆపి వెంటనే వేగంగా ముందుకు పోనిచ్చి, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎస్‌ఐ రమేశ్ కుమార్‌ను గుద్దే ప్రయత్నం చేశాడు. దీంతో ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్‌కుమార్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు కేసులున్న భార్గవరామ్‌పై తాజాగా మరోకేసు నమోదైంది.