అర్ధరాత్రి తెగిన బాలాపూర్ గుర్రం చెరువు కట్ట.. నడుంలోతు మునిగిన కాలనీలు

నిన్న సాయంత్రం నుంచీ హైదరాబాద్ లో మళ్లీ మొదలైన ఏకధాటి వర్షాలకు పాతబస్తీ బాలాపూర్‌లో గుర్రం చెరువుకట్ట తెగింది. దీంతో హఫీజ్ బాబా నగర్, పూల్ బాగ్, ఉమర్ కాలనీ, శివాజీ నగర్, రాజీవ్ నగర్ ఏరియాల్లోకి భారీగా నీరు ప్రవేశించింది. బాబానగర్‌ సహా అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వచ్చి పడిన వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నడుంలోతు నీళ్లలో మునిగిపోయాయి. […]

అర్ధరాత్రి తెగిన బాలాపూర్ గుర్రం చెరువు కట్ట.. నడుంలోతు మునిగిన కాలనీలు
Follow us

|

Updated on: Oct 18, 2020 | 7:14 AM

నిన్న సాయంత్రం నుంచీ హైదరాబాద్ లో మళ్లీ మొదలైన ఏకధాటి వర్షాలకు పాతబస్తీ బాలాపూర్‌లో గుర్రం చెరువుకట్ట తెగింది. దీంతో హఫీజ్ బాబా నగర్, పూల్ బాగ్, ఉమర్ కాలనీ, శివాజీ నగర్, రాజీవ్ నగర్ ఏరియాల్లోకి భారీగా నీరు ప్రవేశించింది. బాబానగర్‌ సహా అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వచ్చి పడిన వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నడుంలోతు నీళ్లలో మునిగిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరద నీటిని తరలించేందుకు రెండు రోజుల క్రితమే అధికారులు గుర్రం చెరువుకి గండికొట్టారు. అయితే, శనివారం సాయంత్రం పడిన భారీ వర్షానికి గుర్రం చెరువు నిండి పోయి నీరంతా బయటకు వచ్చేసింది. హఫీజ్ బాబా నగర్ ఏరియా ఉన్న ఇళ్లన్నీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం జలమయమైంది.