హైదరాబాద్‌ ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లేనని అన్నారు రాష్ట్రమంత్రి కేటీఆర్. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. ఎన్నో విమర్శలు చేసినా… అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్ అన్నారు. జూన్ 2న 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని పని చేశామన్నారు. ఇవాళ మీట్‌ ది ప్రెస్ లో మాట్లాడిన […]

హైదరాబాద్‌ ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే : మంత్రి కేటీఆర్‌
Follow us

|

Updated on: Nov 19, 2020 | 4:14 PM

హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లేనని అన్నారు రాష్ట్రమంత్రి కేటీఆర్. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. ఎన్నో విమర్శలు చేసినా… అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్ అన్నారు. జూన్ 2న 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని పని చేశామన్నారు. ఇవాళ మీట్‌ ది ప్రెస్ లో మాట్లాడిన కేటీఆర్.. టీఆర్‌ఎస్‌పై ఎన్నో రకాల విషప్రచారాలు చేశారని, తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణకు పెట్టుబడులు రావని ప్రచారం చేశారని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్‌ ముందుందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో రెండు చెత్త డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో వారానికి 2 రోజులు పవర్‌ హాలిడేలు ఉండేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు లేవు, గుడుంబా గబ్బులు లేవని.. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు కేసీఆర్ ప్రభుత్వంలో అడ్డుకట్ట పడిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Latest Articles