AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. విడాకులు కోరిందని భార్యపై భర్త కత్తి దాడి.. చావుబతుకుల మధ్య వివాహిత!

మేడిపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో విడాకులు కోరిన భార్య మాధవిపై భర్త తేజ కత్తితో దాడి చేశాడు. గుడి నుంచి వస్తున్న మాధవిని అడ్డుకొని మెడ, భుజంపై తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం.. విడాకులు కోరిందని భార్యపై భర్త కత్తి దాడి.. చావుబతుకుల మధ్య వివాహిత!
Husband Attacks Wife
Balaraju Goud
|

Updated on: Sep 28, 2026 | 8:18 AM

Share

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్న భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. పర్వతాపూర్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవి (28), తేజ (33) దంపతులు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. కుటుంబ విభేదాల కారణంగా మాధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో మాధవిని తేజ అడ్డుకున్నాడు. అనంతరం ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మెడ, భుజం, పొట్ట, తొడ భాగాల్లో కత్తితో గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో మాధవికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

దాడి జరుగుతున్న సమయంలో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో తేజ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ వివాదాలు, విడాకుల వ్యవహారం నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

స్థానికంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో పర్వతాపూర్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో కలకలం నెలకొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us