Hyderabad Hijras Nuisance: హైదరాబాద్‌లో హద్దు మీరిన హిజ్రాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే బట్టలిప్పేసి, అసభ్య ప్రవర్తన..!

హైదరాబాద్ మహానగరంలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. నేరేడ్‌మెట్ ఠాణాలో పోలీసుల ఎదుటే హిజ్రాలు బరితెగించి నానా హంగామా సృష్టించారు.

Hyderabad Hijras Nuisance: హైదరాబాద్‌లో హద్దు మీరిన హిజ్రాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే బట్టలిప్పేసి, అసభ్య ప్రవర్తన..!
Hyderabad Hijras Nuisance
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 17, 2021 | 8:08 PM

Hyderabad Hijras Nuisance in Police Station: హైదరాబాద్ మహానగరంలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. నేరేడ్‌మెట్ ఠాణాలో పోలీసుల ఎదుటే హిజ్రాలు బరితెగించి నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఎవరి ఇంట్లో అయినా పెండ్లి జరిగినా, ఏ శుభకార్యం జరిగినా అక్కడికి హిజ్రాలు ప్రత్యక్షమవుతారు. వారికి తోచినంత డబ్బులు డిమాండ్ చేస్తారు. అంతా ఇవ్వకపోతే నానా హంగామా సృష్టిస్తారు. అంతటితో ఆగకుండా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తూ బట్టలు సైతం విప్పి విచక్షణారహితంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ఘటననే నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చోటు చేసుకుంది.

ఇదే క్రమంలో గురువారం వినాయక నగర్ రోడ్ నెంబర్ 6లోని ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ విషయం తెలిసిన హిజ్రాలు ఆ ఇంటికి చేరుకున్నారు. పెండ్లి వారి ఇంటికి వెళ్లి రూ.50 వేలు డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం డబ్బులు అడిగేసరికి అంతా అవాక్కయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే బట్టలు ఇప్పేస్తామంటూ అసభ్యంగా మాట్లాడుతూ నానా హంగామా సృష్టించారు. వారు అంత మొత్తం ఇవ్వనందుకు పెళ్లివారిపై దాడి చేశారు. అంతేకాకుండా పెళ్లి వారి ముందే బట్టలు విప్పేసి షో చేశారు.

దీంతో పెళ్లివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, హిజ్రాలు పోలీస్ స్టేషన్‌లో సైతం వీరంగం సృష్టించారు. పోలీసుల ముందే బట్టలు విప్పేశారు. నగ్నప్రదర్శన చేస్తూ పోలీసుల ముందు నిరసన తెలిపారు.ఈ ఘటనతో నిచేష్టులైన పోలీసులు ఇందుకు సంబంధించి హిజ్రాలపై ఐపీసీ 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకన్నారు. పోలీస్ స్టేషన్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్‌ మేనెజ్‌మెంట్‌ కింద మరో కేసు నమోదు చేశారు.

Read Also… Telangana Cabinet Sub-Committee: రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీల కీల‌క‌ భేటీ.. రెవెన్యూ మోబిలైజేషన్, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రధాన చర్చ!