హైదరాబాద్ లో హై అలర్ట్. ఇవే ఫోన్ నెంబర్లు !

మూడుగంటల నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీగా కురుస్తున్నవర్షాలకు విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని గుర్తించి విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో సీఎండీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు కు అత్యవసర ఆదేశాలు జారీ […]

హైదరాబాద్ లో హై అలర్ట్. ఇవే ఫోన్ నెంబర్లు !
Venkata Narayana

|

Oct 09, 2020 | 7:19 PM

మూడుగంటల నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీగా కురుస్తున్నవర్షాలకు విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని గుర్తించి విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో సీఎండీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు కు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రఘుమా రెడ్డి సూచించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయండని సీఎండీ  కోరారు. వోల్టేజ్.. విద్యుత్ సరఫరా లో అంతరాయాలపై ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ ఫోన్ నెంబర్లుకు ఫోన్ చేసి సమస్యలు, ఫిర్యాదులు చెప్పవచ్చు. 7382072104, 7382072106, 7382071574

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu