Hyderabad: కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా.. అయ్యో..
హైదరాబాద్‌లోని కాచిగూడలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఏసీ పేలడంతో మంటలు చెలరేగి, నిద్రిస్తున్న పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. కాచిగూడ పీఎస్‌లో పరిధిలోని ఓ ఇంట్లో చిన్నారులు నిద్రపోతుండగా ఉన్నట్టుండి ఇంట్లోని ఏపీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ సుందర్‌నగర్ కాలనీకి చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఖాద్రీ అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కవలలు కూడా ఉన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం సైఫుద్దీన్ కుటుంబ సభ్యులు పిల్లలను ఇంట్లో పడుకోబెట్టి.. బయట మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న ఏసీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి.
గమనించిన కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి ఇంట్లోకి వెళ్లగా.. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు మంటల్లో తీవ్రంగా గాయపడ్డ స్థితిలో కనిపించారు. దీంతో వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే చిన్నారులు ఇద్దరరిలో ఒకరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు.
95 శాతం కాలిన గాయాలతో ఉన్న ఒక బాబుకు చికిత్స అందించారు. వైద్యులు కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని గంటల వ్యవధిలోనే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా అంతులేని విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
