Nethi Beerakaya Pachadi: నేతి బీరకాయ పచ్చడి తింటే ఆహా అనాల్సిందే..

| Edited By: Shaik Madar Saheb

Jul 29, 2024 | 8:43 PM

నేతి బీరకాయ కూడా కూరగాయల్లో ఒకటి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది బీరకాయలు తింటారు కానీ నేతి బీరకాయలను ఇష్టపడరు. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని నుంచి ఒక లాంటి వాసన వస్తుందని తినరు. అయితే వీటితో కూర తినని వారు పచ్చడి తినవచ్చు. ఇప్పుడు చెప్పే స్టైల్‌లో నేతి బీరకాయ పచ్చడి చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యం కూడా..

Nethi Beerakaya Pachadi: నేతి బీరకాయ పచ్చడి తింటే ఆహా అనాల్సిందే..
Nethi Beerakaya Pachadi
Follow us on

నేతి బీరకాయ కూడా కూరగాయల్లో ఒకటి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది బీరకాయలు తింటారు కానీ నేతి బీరకాయలను ఇష్టపడరు. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని నుంచి ఒక లాంటి వాసన వస్తుందని తినరు. అయితే వీటితో కూర తినని వారు పచ్చడి తినవచ్చు. ఇప్పుడు చెప్పే స్టైల్‌లో నేతి బీరకాయ పచ్చడి చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇంత ఆరోగ్యంగా ఉండే నేతి బీరకాయలతో పచ్చడి ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

నేతి బీరకాయలు, పచ్చి మిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, తాళింపు దినుసులు, కరివేపాకు, చింత పండు, పసుపు, ఉప్పు, టమాటాలు, ఆయిల్.

నేతి బీరకాయ పచ్చడి తయారీ విధానం:

ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి.. తొక్కతోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా, పచ్చి మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ నెక్ట్స్ జీలకర్ర కొద్దిగా, ధనియాలు కొద్దిగా వేసి వేగిన తర్వాత.. పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఓ పది నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, చింత పండు, వెల్లుల్లి రెబ్బలు పసుపు, ఉప్పు వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

వీటిని మధ్య మధ్యలో వేయిస్తూ.. కలుపుతూ బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక.. మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే నేతి బీరకాయ పచ్చడి సిద్ధం. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.