Thyroid: అబ్బాయి కంటే అమ్మాయిలకే థైరాయిడ్‌ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా..? ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ అంటారు. ఈ థైరాయిడ్ గ్రంధి శారీరక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి నుంచి స్రవించే థైరాయిడ్ హార్మోన్ శరీరంలోని అన్ని విధులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే నేటి జీవన విధానం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు..

Srilakshmi C

|

Updated on: Jul 29, 2024 | 8:43 PM

గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ అంటారు. ఈ థైరాయిడ్ గ్రంధి శారీరక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి నుంచి స్రవించే థైరాయిడ్ హార్మోన్ శరీరంలోని అన్ని విధులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే నేటి జీవన విధానం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

1 / 5
అబ్బాయిల కంటే అమ్మాయిలకు థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కానీ థైరాయిడ్ వ్యాధి శరీరంలో ఉంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఎల్లప్పుడు చలిగా అనిపిస్తుందా? అయితే మీకు థైరాయిడ్ సమస్య ఉండవచ్చు. శరీరం తగినంత కేలరీలను బర్న్ చేయకుండా నిల్వ చేసుకుంటే, అప్పుడు చలిగా అనిపిస్తుంది. ఇది థైరాయిడ్ లక్షణం కావచ్చు.

2 / 5
థైరాయిడ్ ప్రభావితమైతే శరీరం మొత్తం జీవక్రియ ప్రభావితమవుతుంది. ఫలితంగా బరువు హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. చాలా మంది థైరాయిడ్ అంటే అధిక కొవ్వు అని అనుకుంటారు. కానీ నిజానికి అది నిజం కాదు. ఇది వస్తే బరువు తగ్గవచ్చు, అధిక బరువు పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల లక్షణం కనిపిస్తుంది.

3 / 5
థైరాయిడ్ హార్మోన్లు ప్రధానంగా శరీరానికి శక్తిని అందిస్తాయి. కాబట్టి మీరు రోజులో ఎక్కువ భాగం అలసిపోయినట్లు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్లు, మెట్లు ఎక్కినప్పుడు ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపిస్తే మాత్రం జాగ్రత్త తీసుకోవల్సిందే.

4 / 5
పనిపై దృష్టి పెట్టలేకపోయినా థైరాయిడ్ లక్షణంగా అనుమానించాల్సిందే. అలాగే అలసటతో బాధపడటం కూడా థైరాయిడ్ వ్యాధి లక్షణమే. థైరాయిడ్ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది, ఫలితంగా జుట్టు రాలిపోతుంది. జీవక్రియ సమస్యల కారణంగా కండరాలు, కీళ్ల బలం కోల్పోవడం జరుగుతుంది. ఫలితంగా కండరాలు, కీళ్ల బలహీనత ఏర్పడుతుంది.

5 / 5
Follow us