Bigg Boss Telugu 4: బిగ్ బాస్ 4 విజేతకు ఈ సారి మరింత తగ్గనున్న రెమ్యూనరేషన్, కారణం ఇదే !
బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేత ఎవరు..ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాసేపు ఈ టాపిక్ పక్కన పెడతాం. బిగ్ బాస్ గెలిచిన వారికి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది?.
బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేత ఎవరు..ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాసేపు ఈ టాపిక్ పక్కన పెడతాం. బిగ్ బాస్ గెలిచిన వారికి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది?. రూ 50 లక్షలు అందరికీ తెలిసిన విషయమే అనకుంటున్నారు కదా. ఆగండాగండి…. గెలవగానే రూ.50 లక్షలు వచ్చి అకౌంట్లో పడిపోవు. దానిలో కూడా చాలా కటింగ్స్ ఉన్నాయి. అవును ప్రైజ్ మనీకి టాక్స్ కటింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. రూ.50 లక్షల్లో దాదాపు రూ. 15 లక్షల వరకు టాక్స్ రూపంలో కట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సారి మాత్రం ప్రైజ్ మనీ మరో 10 లక్షలు తగ్గిపోయిందట. కోవిడ్ కారణంగా ఈ కట్టింగ్ ఉంటుందని చెబుతున్నారు. అంటే గెలిచిన విజేతకు రూ.25 లక్షలు చేతికి వస్తుంది. అయితే దీనితో పాటు వారు వారానికి ఇంత అని రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటారు. అది కూడా ఇస్తారు.
ఈ సారి పారితోషకం విషయానికి వస్తే..అవినాష్ , లాస్య లాంటి వాళ్లు వారం లెక్క రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ ఇద్దరూ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ. 40 లక్షల వరకు అవినాష్..రూ. 30 లక్షల వరకు లాస్య సంపాదించారని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో కంటెస్టెంట్లు నోరు విప్పరు. సో..బయటకు వచ్చిన వార్తల్లో ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి వచ్చిన లీకులు ఏవీ పెద్దగా అబద్దాలు అని తేలలేదు.
Also Read :
Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు
Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్
కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్
లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే