#COVID19 తెలంగాణలో ఆసుపత్రుల విభజన.. ఎందుకంటే?

కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తోంది. కేంద్రం ఏదైనా ఆదేశిస్తే కొన్ని గంటల వ్యవధిలోనే దానికి అనుగుణంగా చర్యలకుపక్రమిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.

#COVID19 తెలంగాణలో ఆసుపత్రుల విభజన.. ఎందుకంటే?
Follow us

|

Updated on: Apr 09, 2020 | 1:50 PM

Telangana government divided hospitals into three categories: కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తోంది. ఇందులోభాగంగా కరోనా వైరస్‌పై సుదీర్ఘ కాల పోరాటానికి రెడీ అవుతోంది. అందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేసింది.

తెలంగాణలో కరోనా ట్రీట్‌మెంట్‌ కేంద్రాలను విభజించింది ప్రభుత్వం. కేంద్రం ఆదేశాలతో మూడు విభాగాలుగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ ఆసుపత్రులు, సంరక్షణ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలుగా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. గాంధీ ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ భవనం కోవిడ్‌ ఆసుపత్రులుగా కొనసాగనున్నాయి.

సంరక్షణ కేంద్రాలుగా ఫీవర్‌ ఆసుపత్రి, సరోజిని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలుగా ఆరు పరీక్షా కేంద్రాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలను వెంటనే జారీ చేసింది తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ. కరోనా నియంత్రణ చర్యల్లో వీలైనంత త్వరగా ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సీసీఎంబీ లాంటి కేంద్ర సంస్థల నుంచి వచ్చే సూచనలను తక్షణం అమలు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం వైరస్ నిర్ధారణ పరీక్షలకు పడుతున్న సమయాన్ని మరింతగా తగ్గించగలిగితే.. నిర్దిష్ట సమయంలో వైరస్‌ను కట్టడి చేయగలమని భావిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.