నన్ను నిర్బంధించారు: ఫరూక్ అబ్దుల్లా

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఆయన ఇష్టప్రకారమే ఇంటివద్ద ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. ఆయన్ను అదుపులోకి తీసుకోలేదని, పోలీసులు అరెస్ట్ చేయలేదని షా మంగళవారం స్పష్టం చేశారు. అయితే తనను అదుపులోకి తీసుకొని ఇంట్లోనే నిర్బంధించారని, దీనిపై హోంమంత్రి అబద్ధం చెప్పారని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. ఫరూఖ్ ఎక్కడున్నారో చెప్పాలని, అరెస్టు చేసిన కశ్మీర్‌ నేతలను విడుదల చేయాలని విపక్షాల డిమాండ్‌ చేస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై అమిత్‌ షా, […]

నన్ను నిర్బంధించారు: ఫరూక్ అబ్దుల్లా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 06, 2019 | 7:01 PM

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఆయన ఇష్టప్రకారమే ఇంటివద్ద ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. ఆయన్ను అదుపులోకి తీసుకోలేదని, పోలీసులు అరెస్ట్ చేయలేదని షా మంగళవారం స్పష్టం చేశారు. అయితే తనను అదుపులోకి తీసుకొని ఇంట్లోనే నిర్బంధించారని, దీనిపై హోంమంత్రి అబద్ధం చెప్పారని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. ఫరూఖ్ ఎక్కడున్నారో చెప్పాలని, అరెస్టు చేసిన కశ్మీర్‌ నేతలను విడుదల చేయాలని విపక్షాల డిమాండ్‌ చేస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై అమిత్‌ షా, ఫరూఖ్‌ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయంప్రత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం సోమవారం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ప్రధాన నాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం నుంచి సభకు రాకపోవడం సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కశ్మీర్‌కు సంబంధించి సంచలన నిర్ణయాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకొని, సోమవారం అధికారికంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా కమ్యునికేషన్ వ్యవస్థ, బహిరంగ సభలు, ర్యాలీల మీద నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.