రైస్ కుక్కర్‌తో ఫేస్ మాస్క్‌ల శానిటైజ్ చేయొచ్చట !
ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో ఫేస్ మాస్క్ మనుషులకు సంజీవనిగా మారింది. అయితే రోజుకొకటి చొప్పున ఫేస్ మాస్క్ పెట్టుకోవాలంటే పేద, మధ్య తరగతి వర్గాలకు కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం.

Electric cookers can disinfect N95 masks : ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో ఫేస్ మాస్క్ మనుషులకు సంజీవనిగా మారింది. అయితే రోజుకొకటి చొప్పున ఫేస్ మాస్క్ పెట్టుకోవాలంటే పేద, మధ్య తరగతి వర్గాలకు కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ క్రమంలో చాలామంది ఉపయోగించిన మాస్కులనే మళ్లీ, మళ్లీ వినియోగిస్తున్నారు. ఇలాంటి మాస్క్‌లను క్లీన్ చేయడం కూడా కాస్త కష్టతరమైన విషయమే. సబ్బు, సర్ఫ్‌తో కడిగినా మాస్క్‌లు పూర్తిగా శుభ్రం అవుతాయన్న నమ్మకం లేదు.
అయితే ..ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, హీట్ పాట్‌లతో మాస్కులను సమర్థవంతంగా క్లీన్ చేయవచ్చని అమెరికా సైంటిస్టులు కనుగొన్నారు. ఎన్95 మాస్క్‌లను 50 నిమిషాలపాటు కుక్కర్లలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేయడం ద్వారా అవి పూర్తిగా క్లీన్ అవుతాయని కనుగొన్నారు. ఈ పద్ధతి ద్వారా ఎన్95 మాస్క్‌ల ఫిల్టర్లూ బాగా వర్క్ చేస్తాయని చెబుతున్నారు. ఈ పద్ధతిలో 20 సార్లు మాస్క్‌ను శానిటైజ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఇల్లినాయీ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన ఈ పరిశోధనలో భారతీయ మూలాలున్న ప్రొఫెసర్ విశాల్ వర్మ కూడా భాగస్వామిగా ఉన్నారు.
Also Read : బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలంగాణలో విస్తారంగా వర్షాలు