‘లయన్ కింగ్‌’ను తలదన్ని.. చిరు గాడిద హమ్మింగ్.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ‘ది లయన్ కింగ్’ గర్జన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం మెప్పించడంతో రెండు వారాలు గడిచినా.. తన హవాను కొనసాగిస్తున్నాడు బుల్లి సింహం రాజు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంట్రోను తనదైన స్టైల్‌లో చేసి అందరి చేత నవ్వులు పూయిస్తున్నాడు సౌత్ కరోలినాకు చెందిన ట్రేవిస్ కిన్లీ అనే వ్యక్తి. తన పెంపుడు గాడిద(పేరు నదన్)తో కలిసి ట్రేవిస్ […]

‘లయన్ కింగ్‌’ను తలదన్ని.. చిరు గాడిద హమ్మింగ్.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2019 | 6:44 AM

డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ‘ది లయన్ కింగ్’ గర్జన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం మెప్పించడంతో రెండు వారాలు గడిచినా.. తన హవాను కొనసాగిస్తున్నాడు బుల్లి సింహం రాజు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంట్రోను తనదైన స్టైల్‌లో చేసి అందరి చేత నవ్వులు పూయిస్తున్నాడు సౌత్ కరోలినాకు చెందిన ట్రేవిస్ కిన్లీ అనే వ్యక్తి. తన పెంపుడు గాడిద(పేరు నదన్)తో కలిసి ట్రేవిస్ చేసిన ‘ద లయన్ కింగ్’ ఇంట్రో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక ట్రేవిస్ ఇంట్రోను చెప్పే సమయంలో అందుకు తగ్గట్లుగా ఆ గాడిద ఇచ్చిన హమ్మింగ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మిలియన్ల వ్యూస్, లక్షలాది లైక్‌లతో ఓవర్‌నైట్ స్టార్లు అయిపోయారు ట్రేవిస్, నదన్. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.

https://www.facebook.com/travis.kinley/videos/10216809100434042/?t=7