AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్రరూపం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిం ది.

భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్రరూపం
Balaraju Goud
|

Updated on: Oct 16, 2020 | 6:39 AM

Share

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిం ది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 6,31,182 విడుదల చేయగా.. డ్యాంకు 5,20,832 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అయ్యింది. దీంతో డ్యాం 10 గేట్లను 25 అడుగుల ఎత్తు తెరిచి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. దిగువకు 5,61,510 క్యూసెక్కులు వదులుతున్నారు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25,737 క్యూ సెక్కులు కలిపి మొత్తం 5,87,247 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమ ట్టం 885 అడుగులకుగానూ 883.50 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా 207.4103 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాల కారణంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గురువారం రాత్రి అధికారులు ప్రాజెక్ట్‌ 50 గేట్లను ఎత్తి దిగువకు 5,81,300 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 5,05,000, అవుట్‌ఫ్లో 5,82,275 క్యూసెక్కులుగా ఉంది. ప్రా జెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుతం నీటి మట్టం 1,041.634 అడుగులు, ప్రస్తుతం నీటి సామార్థ్యం 7.627 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలకు నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. అటు పైన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 98,270, అవుట్‌ఫ్లో 1,11,279 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,705.00 అడుగులు, నిల్వ 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,704.53 అడుగులు, 127.10 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు, నారాయణపూర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,40,244, అవుట్‌ఫ్లో 1,54,530 క్యూసెక్కులకు చేరింది. పూ ర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగులు, నిల్వ 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,612.76 అడుగులు, 34.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

తుంగభద్ర నదిలోకి భారీగా వరద నీటి వచ్చి చేరుతుంది. టీబీ డ్యాంకు 17,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 19,006 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ట్రా పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు, నిల్వ 100.855 టీ ఎంసీలు కాగా, ప్రస్తుతం 1,632.85 అడుగులు, 100.276 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ఎస్‌ఈ వెంకట రమణ తెలిపారు. ఆర్డీఎస్‌ డ్యాంలోకి 34,633 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు కాగా 34 వేల క్యూసెక్కులు ఆనకట్ట పై నుంచి దిగువకు పారుతున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 352 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ప్రస్తుతం 10.4 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు.