యూనివర్స్ బాస్ అదరగొట్టాడు.. పంజాబ్ మురిసింది..

ఐపీఎల్‌ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో..

యూనివర్స్ బాస్ అదరగొట్టాడు.. పంజాబ్ మురిసింది..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 15, 2020 | 11:29 PM

IPL 2020: ఐపీఎల్‌ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి… లీగ్‌లో రెండో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ(48) రాణించడంతో అర్సీబీ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఎప్పటిలానే ఓపెనర్లు రాహుల్(61*), మయాంక్ అగర్వాల్(45) మంచి ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అగర్వాల్(45) చాహల్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. వన్ డౌన్‌లో వచ్చిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(53) అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో పూరన్ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌కు ఒక వికెట్ దక్కింది.