అంతర్వేదిలో పోటెత్తిన సముద్రం

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర...

అంతర్వేదిలో పోటెత్తిన సముద్రం
Follow us

|

Updated on: Oct 16, 2020 | 12:51 AM

Sea Waves : తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో పోటెత్తుతున్న ఉప్పునీరు, ప్రస్తుత అల్పపీడన ప్రభావం ఓ వైపు.. మరికొన్ని గంటల్లో అమావాస్య గడియలు సమీపిస్తుండటంతో సముద్రుడు మరింత ఉగ్రుడవుతున్నాడు.

గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు వస్తున్నాయి. అంతర్వేది కొత్త వంతెనకు సమీపంలో రోడ్డును దాటి సరుగుడు తోటల్లోకి చేరాయి. పల్లెపాలెం గ్రామంలో ఇళ్లలోకి చేరింది పొంగిన సముద్రపు నీరు.

దీంతో 50 కుటుంబాలు తుఫాన్ సెంటర్‌కు తరలివెళ్లాయి. తమ గోడు చెప్పుకునేందుకు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని అంటున్నారు బాధిత కుటుంబాలు. ఓవైపు సముద్రపు నీరు ఇళ్లకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.