ర‌ణ్‌‌వీర్ సింగ్ కారుకు ప్రమాదం..

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌‌వీర్ సింగ్ కారు చిన్నపాటి ప్ర‌మాదం జరిగింది. ముంబైలోని ఓ స్టూడియోలో గురువారం డ‌బ్బింగ్ పూర్తి చేసుకుని తిరుగు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ర‌ణ్‌వీర్ మెర్సిడిస్ కారును వెన‌క నుంచి ఓ బైక్ ఢీ కొట్టింది...

ర‌ణ్‌‌వీర్ సింగ్ కారుకు ప్రమాదం..
Follow us

|

Updated on: Oct 15, 2020 | 9:52 PM

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌‌వీర్ సింగ్ కారు చిన్నపాటి ప్ర‌మాదం జరిగింది. ముంబైలోని ఓ స్టూడియోలో గురువారం డ‌బ్బింగ్ పూర్తి చేసుకుని తిరుగు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ర‌ణ్‌వీర్ మెర్సిడిస్ కారును వెన‌క నుంచి ఓ బైక్ ఢీ కొట్టింది. ప్రమాదం జరిగన వెంటనే హీరో గాబ‌రాగా దిగి ఏమైనా డ్యామేజ్ అయిందేమోన‌ని ప‌రిశీలించారు. అదృష్ట‌వ‌శాత్తూ కారుకు కూడా ఎలాంటి న‌ష్టం చోటు చేసుకోలేదు. దీంతో అంతా బాగానే ఉంది అని నిర్ధారించుకున్నాక తిరిగి కారెక్కి అక్క‌డ‌నుంచి ర‌ణ్‌‌వీర్ సింగ్ వెళ్లిపోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాఫిక్ రద్దీగా ఉంది.

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ర‌ణ్‌‌వీర్ సింగ్ బయటకు రావడమే ఆలస్యం అక్కడే ఉన్న ఓ అభిమాని ఓ వీడియోను తీశారు. తీసి వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ర‌ణ్‌వీర్ క్షేమంగానే ఉన్నార‌ని అందులో పేర్కొన్నారు.

ఇక కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న బాలీవుడ్ నటులు .. సినిమా షూటింగ్‌లతో బిజీగా మారుతున్నారు. ర‌ణ్‌వీర్ ’83’ అనే క్రీడా నేప‌థ్యం గ‌ల ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో ఆయ‌న టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే తెలుగు మాస్ మ‌సాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ హిందీ రీమేక్‌లో కూడా రణ్‌వీర్క ‌నిపించ‌నున్నార‌ని బీ టౌన్‌లో వినిపిస్తోంది.