AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకే అత్యధిక ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే
Telangana Weahter Updates
Srilakshmi C
|

Updated on: May 07, 2026 | 7:22 PM

Share

హైదరాబాద్‌, మే 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకే అత్యధిక ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం భద్రాచలం మినహా మిగతా జిల్లాలన్నీ 40 లోపే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. భద్రాచలంలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాదులో స్వల్పంగా 36. 8 డిగ్రీలకే పగటిపూట ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి.

మరోపక్క నిన్న ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ మార్పులవల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

నేటి పగలు ఉష్ణోగ్రతలు ఇలా..

  • అదిలాబాద్ 39.8 డిగ్రీలు
  • భద్రాచలం 40.2 డిగ్రీలు
  • హనుమకొండ 38.5 డిగ్రీలు
  • హైదరాబాద్ 36.8 డిగ్రీలు
  • ఖమ్మం 40 డిగ్రీలు
  • మహబూబ్ నగర్ 38.9 డిగ్రీలు
  • మెదక్ 39.2 డిగ్రీలు
  • నల్గొండ 39.5 డిగ్రీలు
  • నిజాంబాద్ 39.4 డిగ్రీలు
  • రామగుండం 38.2 డిగ్రీలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన డ్రింక్.. ఇలా ఈజీగా చేసుకోండి
వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన డ్రింక్.. ఇలా ఈజీగా చేసుకోండి
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్‌..
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్‌..
ఇండి గుమ్మానికి కట్టిన తోరణం ఎండిపోతే ఆ సమస్యలు తప్పవా?
ఇండి గుమ్మానికి కట్టిన తోరణం ఎండిపోతే ఆ సమస్యలు తప్పవా?
మీ పుట్టిన తేదీని బట్టి మీది లవ్ మ్యారేజా?పెద్దలు కుదిర్చే పెళ్లా
మీ పుట్టిన తేదీని బట్టి మీది లవ్ మ్యారేజా?పెద్దలు కుదిర్చే పెళ్లా
ఆర్సీబీ బౌలింగ్.. లక్నో బ్యాటింగ్.. ఏకానాలో అసలు సిసలు మజా
ఆర్సీబీ బౌలింగ్.. లక్నో బ్యాటింగ్.. ఏకానాలో అసలు సిసలు మజా
చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! ఎందుకంటే
చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! ఎందుకంటే
ఆ నటుడు తెరపై కనిపించినట్లు సెట్స్‌లో ఉండరు: జేడీ చక్రవర్తి
ఆ నటుడు తెరపై కనిపించినట్లు సెట్స్‌లో ఉండరు: జేడీ చక్రవర్తి
అర్ధరాత్రి సివిల్ డ్రెస్‌లో లేడీ సింగం. వేధించిన 40 మంది పోకిరీలు
అర్ధరాత్రి సివిల్ డ్రెస్‌లో లేడీ సింగం. వేధించిన 40 మంది పోకిరీలు
శామ్‌సంగ్‌‌కు షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సె వ్యాపారం బంద్..
శామ్‌సంగ్‌‌కు షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సె వ్యాపారం బంద్..
ఐపీఎల్ మధ్యలో ముంబై స్టార్ ఇంట్లో సంబరాలు
ఐపీఎల్ మధ్యలో ముంబై స్టార్ ఇంట్లో సంబరాలు