మరణించిన ప్రియురాలి కోర్కె తీర్చేందుకు..
చైనాలో ఓ వ్యక్తి మరణించిన తన ప్రియురాలి కోర్కె తీర్చేందుకు సిధ్దమైన వైనం అందర్నీ కలచివేసింది. ఆమె మృతి చెందినా ఆమె పట్ల తన ప్రేమను హృద్యంగా చాటుకున్నాడు. 35 ఏళ్ళ షూ షినాన్.. . ‘ యాంగ్ ల్యూ ‘ అనే అమ్మాయిని ప్రేమించాడు. 2007 లో వీళ్ళిద్దరూ యూనివర్సిటీ క్లాస్ మేట్స్. దాదాపు ఆరేళ్ళ అనంతరం 2013 లో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటివారమవుదామని అనుకుంటుండగా.. అప్పుడే […]
చైనాలో ఓ వ్యక్తి మరణించిన తన ప్రియురాలి కోర్కె తీర్చేందుకు సిధ్దమైన వైనం అందర్నీ కలచివేసింది. ఆమె మృతి చెందినా ఆమె పట్ల తన ప్రేమను హృద్యంగా చాటుకున్నాడు. 35 ఏళ్ళ షూ షినాన్.. . ‘ యాంగ్ ల్యూ ‘ అనే అమ్మాయిని ప్రేమించాడు. 2007 లో వీళ్ళిద్దరూ యూనివర్సిటీ క్లాస్ మేట్స్. దాదాపు ఆరేళ్ళ అనంతరం 2013 లో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటివారమవుదామని అనుకుంటుండగా.. అప్పుడే యాంగ్ కి బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. కానీ ఆమె మీద అతని ప్రేమ చెక్కుచెదరలేదు. రోగి అయిన తన ప్రియురాలికి సేవలు చేస్తూనే వచ్చాడు. చివరకు ఈ నెల 6 న యాంగ్ మరణించింది. అయితే మరణానికి ముందు తనను పెళ్ళికూతురిలా చూసుకోవాలని ఆఖరి కోర్కె కోరింది. షినాన్ అలాగే ఆమె డెడ్ బాడీని వధువులా అలంకరించి ఆమె అంత్యక్రియలు చేశాడు. వీరి ఉదంతం చైనాలో వేలాదిమందిని కదిలించింది. వీబో వంటి ట్విట్టర్లో అనేకమంది షునాన్ అసలైన ప్రియుడని ప్రశంసలతో ముంచెత్తారు.