సైకిల్‌పై వచ్చి బాధ్యతలు చేపట్టిన ఆరోగ్య మంత్రి!

మోదీ కొత్త కేబినెట్‌లో ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ దక్కించుకున్న హర్ష హర్దన్ సోమవారంనాడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం ఆయన సైకిల్‌పై తన కార్యాలయానికి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ‘ప్రపంచ బైస్కిల్ డే’ కూడా ఇవాళే కావడం విశేషం. అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘సైక్లింగ్ చాలా సులభం, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, తేలికైన రవాణా మాధ్యమం, వీటన్నిటికీ తోడు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తమని అన్నారు. అభివృద్ధి […]

సైకిల్‌పై వచ్చి బాధ్యతలు చేపట్టిన ఆరోగ్య మంత్రి!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 8:06 PM

మోదీ కొత్త కేబినెట్‌లో ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ దక్కించుకున్న హర్ష హర్దన్ సోమవారంనాడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం ఆయన సైకిల్‌పై తన కార్యాలయానికి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ‘ప్రపంచ బైస్కిల్ డే’ కూడా ఇవాళే కావడం విశేషం.

అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘సైక్లింగ్ చాలా సులభం, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, తేలికైన రవాణా మాధ్యమం, వీటన్నిటికీ తోడు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తమని అన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సైక్లింగ్‌ విశిష్టతను గుర్తించే జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకొంటామని, తనకు కూడా సైక్లింగ్ ఒక ఫేవరెట్ క్రీడ అని’ ఆ ట్వీట్‌లో హర్ష వర్దన్ పేర్కొన్నారు.

Latest Articles