AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరియాళి అమావాస్య 2026: ఆగస్టు 12న ఈ పనులు చేస్తే పుణ్యం.. మర్చిపోవద్దు!

శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను హరియాళి అమావాస్యగా ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. 2026 ఆగస్టు 12న ఈ పవిత్ర పండుగ రానుంది. ఈ రోజున పుష్య నక్షత్రంతో పాటు గౌరీ యోగం, గజకేసరి యోగం వంటి అరుదైన శుభ యోగాలు ఏర్పడుతుండటం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ పవిత్ర దినాన తప్పక పాటించాల్సిన నియమాలు, చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హరియాళి అమావాస్య 2026: ఆగస్టు 12న ఈ పనులు చేస్తే పుణ్యం.. మర్చిపోవద్దు!
Hariyali Amavasya 2026Image Credit source: tv9 gujarathi
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2026 | 6:08 PM

Share

హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యను హరియాళి అమావాస్య లేదా శ్రావణ అమావాస్యగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రకృతి ఆరాధనకు, పర్యావరణ పరిరక్షణకు, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలుస్తుంది. 2026 ఆగస్టు 12న ఈ పవిత్ర పండుగ రానుంది. ఈ రోజున పుష్య నక్షత్రంతో పాటు రెండు అరుదైన శుభ యోగాలు ఏర్పడుతుండటం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.

ముహూర్తం, శుభ యోగాలు:

పంజాగం ప్రకారం, 2026 శ్రావణ అమావాస్య తిథి ఆగస్టు 11 రాత్రి 01:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 12 రాత్రి 11:07 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి నియమం ప్రకారం ఆగస్టు 12న హరియాళి అమావాస్యను ప్రధానంగా జరుపుకుంటారు. ఈ రోజున పుష్య నక్షత్రంతో పాటు చంద్రుడు తన స్వరాశి అయిన కర్కాటకంలో ఉండటం వల్ల గౌరీ యోగం, గజకేసరి యోగం వంటి అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో చేసే పూజలు, దానధర్మాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత – పూజా విధానం:

వృక్ష ఆరాధన: రావి చెట్టులో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని నమ్ముతారు. ఈ రోజున రావి, తులసి చెట్లకు పూజ చేయడం వల్ల సకల దోషాలు తొలగుతాయి.

ఇవి కూడా చదవండి

పితృ తర్పణం: నదీ స్నానం చేసి పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం, బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, గోవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల పితృ దోష శాంతి లభిస్తుంది.

వ్యవసాయ పరికరాల పూజ: రైతులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజ చేసి మంచి పంటలు పండాలని ప్రార్థిస్తారు.

రాశి చక్రం ప్రకారం నాటాల్సిన మొక్కలు:

హరియాళి అమావాస్య నాడు రాశి అనుసారం మొక్కలు నాటడం శుభకరం.

మేషం: ఉసిరి | వృషభం: నేరేడు | మిథునం: సంపెంగ

కర్కాటకం: రావి | సింహం: మర్రి లేదా అశోక | కన్య: మారేడు (బిల్వం)

తులా: అర్జున చెట్టు | వృశ్చికం: వేప | ధనుస్సు: గన్నేరు

మకరం: జమ్మి (శమి) | కుంభం: కదంబం లేదా మామిడి | మీనం: రేగు

నవగ్రహ శాంతికి వృక్షారోపణ:

సూర్యుని కోసం జిల్లేడు, చంద్రునికి మోదుగ, కుజునికి చండ్ర, బుధునికి ఉత్తరేణి, గురునికి రావి, శుక్రునికి మేడి, శనికి జమ్మి, రాహువుకి చందనం లేదా గరిక మొక్క నాటడం ద్వారా గ్రహ దోష ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆచారాలు సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా ఉన్నాయి. కుటుంబం, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us