ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ మరో ఛాన్స్..!
జనతాదళ్ (యు) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరిగి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

జనతాదళ్ (యు) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరిగి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 1న ముగియనున్నాయి. తొలిరోజు సభ ఎజెండాలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అంశం చేర్చినట్లు సమాచారం.
రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ప్రకారం, డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 11 చివరి తేదీ. డిప్యూటీ చైర్మన్ పదవి ఏకగ్రీవం కావాలని అధికార ఎన్డీయే కూటమి ప్రయత్నిస్తొంది. అయితే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ అనుభవం ఉండటంతో,ఆయననే తిరిగి ఎన్నుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా పార్టీలకు అతీతంగా రాజ్యసభను హుందాగా నడుపుతున్నారంటూ హరివంశ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే తొలి ప్రాధాన్యం కూడా ఆయనకే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
