సీఏ చదివిన ఈ వ్యక్తి ఎంత క్రూరుడో.. భార్య పేరుతో భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి.. ఆపై తుదముట్టించాడు

డబ్బు కోసం మనుషులు అడ్డదార్లు తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తిలో పడి కనీసం బంధుత్వాలు, భాందవ్యాలు కూడా మర్చిపోతున్నారు.   భార్య మరణిస్తే..

సీఏ చదివిన ఈ వ్యక్తి ఎంత క్రూరుడో.. భార్య పేరుతో భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి.. ఆపై తుదముట్టించాడు
Follow us

|

Updated on: Feb 07, 2021 | 12:04 PM

డబ్బు కోసం మనుషులు అడ్డదార్లు తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తిలో పడి కనీసం బంధుత్వాలు, భాందవ్యాలు కూడా మర్చిపోతున్నారు.   భార్య మరణిస్తే.. ఆమె పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని ఆశపడ్డ ఓ వ్యక్తి పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెను చంపి.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన గుజరాత్​ బనాస్​కాంఠా జిల్లా భిల్దీ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..  గుజరాత్​ బనాస్​కాంఠా జిల్లాకు చెందిన లలిత్​ తంక్​ .. చార్టెడ్​ అకౌంటెంట్​గా పనిచేస్తున్నాడు. భార్య దక్షబెన్​ తంక్ పేరుతో  భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. ఆపై ఆమె చనిపోతే రూ. 60లక్షలు వస్తాయని కనీసం మానవత్వం లేకుండా అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఆమెను చంపేందుకు ఒకరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు

డిసెంబర్​ 26న దక్షబెన్​ను గుడికి తీసుకెళ్లాడు లలిత్​.  పక్కా ప్లాన్ ప్రకారం .. ఆ వ్యక్తికి ఫోన్ చేసి తాము రోడ్డు మీద నడుస్తున్న సమయంలో.. వాహనంతో వేగంగా వచ్చి తన భార్యను ఢీ కొట్టమని చెప్పాడు. లలిత్​ చెప్పినట్టే చేశాడు ఆ వ్యక్తి. ఆమె స్పాట్‌లోనే చనిపోయింది.

క్రూరుడు ఎలా చిక్కాడంటే..?

తొలుత.. యాక్సిడెంటల్ డెత్​గా కేసు నమోదు చేసుకున్నారు భిల్దీ స్టేషన్​ పోలీసులు. కానీ దక్షబెన్​ మరణంపై.. ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. లలిత్​పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో రివర్స్ విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీటీవీలను, కాల్ డేటాను పరిశీలించారు. చివరికి.. అది యాక్సిండ్ కాదని ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నిర్ధారించారు. లలిత్​ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతనికి సహకరించిన డ్రైవర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:

ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Postal Circle jobs: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేవలం టెన్త్ మార్కులతో 3446 పోస్టల్ ఉద్యోగాలు..