Guava Health Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి లాభాలంటే..

Guava Health Benefits: ప్రస్తుతం మారుతున్నకాలానుగుణంగా జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తీసుకునే ఆహారం, ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, మానసిక వేదన..

Guava Health Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి లాభాలంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2021 | 11:34 AM

Guava Health Benefits: ప్రస్తుతం మారుతున్నకాలానుగుణంగా జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తీసుకునే ఆహారం, ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, మానసిక వేదన తదితర కారణాలతో వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. అయితే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పడేది మన చేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా ప్రతి రోజు తీసుకునే ఆహారం కంటే పండ్లు కూడా తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్ని ఆస్తులున్నా.. ఆరోగ్యంగా లేకపోతే కష్టమే. ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య అధికంగా పెరిగిపోతుంది.

అయితే కొన్ని మాత్రం పెద్దగా ఖర్చులేకుండానే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారి సలహాలు, సూచనల ప్రకారం.. ఇక సామాన్యుడికి చౌకగా దొరికే పండ్లల్లో జామ ఒకటి. జామకాయలో ఎన్నో పోషకాలున్నాయి. జామతో ఎలాంటి లాభాలుంటాయో తెలిస్తే అస్సలు వదలరు. జామ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా కాలేయానికి ఎంతో ఔషదంలా పని చేస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రస్తుతం డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి వారికి జామ ఎంతో ఉపయోగకరం. రక్తంలో షుగర్స్‌ లేవల్స్‌ను తగ్గించేస్తుంది. వీటిని తరుచుగా తీసుకుంటే మరీ మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

అంతేకాదు.. జామలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఫైబర్‌ సమృద్దిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించడంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోఏబీసీ విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయసు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. జామ పండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది. జామలో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. అలాగే బీపీ పెరగకుండా కాపాడుతుంది. జామలో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ ఎర్ర రక్త కణాళ ఉత్పత్తిలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే జామలో విటమిన్‌-సి, లైకోపీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో మాంగనీస్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మనం తినే ఆహారం నుంచి ఇతర కీలక పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల మెదడు పనితీరు ఎంతో మెరుగు పడుతుంది. ఇవేకాకుండా మరెన్నో ప్రయోజనాలున్నాయి.

Also Read: Mustard oil: వ్యాధులను ధరిచేరనీయని ఆవనూనే గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!