విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు గుడ్ న్యూస్…
ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను మే 7నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. విడతలవారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొంది. కోవిడ్-19 లక్షణాలు లేనివారినే ఇండియా చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. విమానాలు, నౌకల ద్వారా ఈ తరలింపు ఉంటుందని పేర్కొంది. సదరు ప్రయాణ ఖర్చులు వారే చెల్లించవలసి ఉంటుందని వివరించారు అధికారులు. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారందరికీ మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అనంతరం 14 రోజులపాటు వారు క్వారంటైన్ సెంటర్స్ […]
ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను మే 7నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. విడతలవారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొంది. కోవిడ్-19 లక్షణాలు లేనివారినే ఇండియా చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. విమానాలు, నౌకల ద్వారా ఈ తరలింపు ఉంటుందని పేర్కొంది. సదరు ప్రయాణ ఖర్చులు వారే చెల్లించవలసి ఉంటుందని వివరించారు అధికారులు.
విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారందరికీ మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అనంతరం 14 రోజులపాటు వారు క్వారంటైన్ సెంటర్స్ లో ఉండాల్సి వస్తుంది. 14 రోజులు పూర్తయిన అనంతరం వారి విషయంలో తదుపరి ప్రక్రియ ఉంటుంది. విదేశాల్లోని వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు రూల్స్ సిద్దం చేసింది కేందరం.
ఇప్పటికే పలు దేశాల్లోని ఇండియన్ ఎంబసీ ఆఫీసులు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయుల్లో వెనక్కి తీసుకొచ్చే వారి లిస్ట్ రూపొందించాయి. జాబితా మేరకు వారిని ఇండియా వచ్చేందుకు అనుమతించనున్నారు. ట్రావెలింగ్ లో కూడా వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వెనక్కి వచ్చిన అనంతరం వారంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. అందులో వారి వివరాలు రికార్డు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది కేంద్రం. ప్రయాణాలకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖల వెబ్సైట్లో ఉంచనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ టెస్టులు, క్వారంటైన్ సెంటర్స్ వంటి ఏర్పాట్లు చేయాలని స్పష్టత ఇచ్చింది కేంద్రం.