AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్

ఏపీ కొత్త డీజీపీగా ఐపీఎస్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలని తెలిపారు. ఏపీ పోలీస్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు. పోలీస్ శాఖను పునరుద్దరించేందుకు సీఎం ఆదేశాలిచ్చారని.. అందుకు అవసరమైన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. తమ కోసమే పోలీస్ […]

ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 01, 2019 | 1:27 PM

Share

ఏపీ కొత్త డీజీపీగా ఐపీఎస్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలని తెలిపారు. ఏపీ పోలీస్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు. పోలీస్ శాఖను పునరుద్దరించేందుకు సీఎం ఆదేశాలిచ్చారని.. అందుకు అవసరమైన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. తమ కోసమే పోలీస్ శాఖ ఉందని ప్రజలు అనుకునేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

అయితే 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ గతంలో విజయవాడ సీపీగా పనిచేశారు. యాంటీ కరెప్షన్ బ్యూరోలో ఉన్నప్పుడు సమర్థవంతా విధులు నిర్వహించిన అధికారిగా పేరొందారు. విధి నిర్వహణలో చురుకైన పాత్ర పోషించినందుకుగానూ 2002లో పోలీస్ మెడల్ అందుకున్నారు సవాంగ్. ఆ తరువాత 2005లో సీఆర్పీఎఫ్ డీజీగా సేవలు అందించారు. 2015లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్న గౌతమ్ సవాంగ్.. మొన్నటివరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్‌గా పనిచేశారు.

Follow Us
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..