కాలికట్ విమానాశ్రయంలో 3.7 కిలోల బంగారం సీజ్
అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా.. దొంగ దారులు వెతుకుతూనే ఉన్నారు. బంగారు అక్రమ రవాణాను విమానాల్లో యధేచ్చగా సాగిస్తూనే ఉన్నారు.
అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా.. దొంగ దారులు వెతుకుతూనే ఉన్నారు. బంగారు అక్రమ రవాణాను విమానాల్లో యధేచ్చగా సాగిస్తూనే ఉన్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కేరళలోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి అక్రమంగా తరలిస్తున్న 2.3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. షార్జా నుంచి వచ్చిన మహిళా ప్యాసింజర్ పై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో 1.65 కిలోల బంగారం సదరు మహిళా ప్రయాణికురాలి లోదుస్తుల్లో గుర్తించారు. అలాగే, 650 గ్రాముల బంగారాన్ని మరో వ్యక్తి బ్యాగులో క్యాప్సిల్స్ రూపంలో తీసుకువస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విమాన సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి కేరళలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు పసిడి అక్రమ దందాకు మరోసారి షురూ చేశారు.
Kerala: Officers of Air Customs Intelligence at Calicut Int’nl Airport have seized 3.701 kgs of gold in paste form from two passengers. The value of the seized gold is approximately Rs 1.65 crores pic.twitter.com/7vU1ZuOHRV
— ANI (@ANI) October 7, 2020