వరుసగా రెండో రోజూ లాభాలతో ట్రేడవుతోన్న బంగారం, వెండి. ఎంసీఎక్స్‌ తోపాటు, న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ సువర్ణ దూకుడు

అంతర్జాతీయంగా పసిడికి సానుకూల పవనాలు వీస్తుండటంతో నేటితో వరుసగా రెండో రోజూ బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో..

వరుసగా రెండో రోజూ లాభాలతో ట్రేడవుతోన్న బంగారం, వెండి. ఎంసీఎక్స్‌ తోపాటు,  న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ సువర్ణ దూకుడు
Follow us

|

Updated on: Dec 16, 2020 | 12:26 PM

అంతర్జాతీయంగా పసిడికి సానుకూల పవనాలు వీస్తుండటంతో నేటితో వరుసగా రెండో రోజూ బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 137 పుంజుకుని రూ. 49,580 వద్ద ట్రేడవుతోంది. తొలుత 49,510 వద్ద కనిష్టంగా ప్రారంభమై, తదుపరి రూ. 49,626 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ సైతం రూ. 318 వృద్ధితో రూ. 65,171 వద్ద కదులుతోంది. రూ. 65,000 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 65,324 వద్ద గరిష్టానికి చేరింది. అటు, న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ వీటి దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం పసిడి ఔన్స్‌ 0.3 లాభంతో 1,861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,857 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.75 శాతం పెరిగి 24.83 డాలర్ల వద్ద కదులుతోంది. బులియన్‌ వర్గాల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది. ఈ నెల 18న యూఎస్‌ కాంగ్రెస్‌ సహాయక ప్యాకేజీపై సమీక్షను చేపట్టే వీలున్నట్లు వెలువడిన వార్తలు పసిడికి జోష్‌ నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..