మళ్లీ పెరిగిన బంగారం ధర
న్యూ ఢిల్లీ : బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర.. ఒక్క రోజే రూ. 425 పెరిగింది. దీంతో మళ్లీ రూ.33 వేల మార్క్‌ను దాటింది. సోమవారం బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.33,215 పలికింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర మళ్లీ పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి కూడా […]

న్యూ ఢిల్లీ : బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర.. ఒక్క రోజే రూ. 425 పెరిగింది. దీంతో మళ్లీ రూ.33 వేల మార్క్‌ను దాటింది. సోమవారం బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.33,215 పలికింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర మళ్లీ పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు వెండి కూడా బంగారం దారిలోనే వెళ్తోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కేజీ వెండి ధర రూ.170 పెరిగి.. రూ.38,670కి చేరింది. అంతర్జాతీయంగానూ వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి.