ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల ప్రమాద భీమా : గోవా సీఎం
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నా ఫ్రంట్ వారియర్స్ రక్షణ కల్పిస్తూ భరోసా నింపుతోంది గోవా సర్కార్. కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ. 50 లక్షల బీమా వర్తిస్తుందన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నా ఫ్రంట్ వారియర్స్ రక్షణ కల్పిస్తూ భరోసా నింపుతోంది గోవా సర్కార్. గోవాలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కార్యకర్తలకు గోవా సర్కార్ రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని విస్తరించింది. కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ. 50 లక్షల బీమా వర్తిస్తుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం తెలిపారు. అలాగే, ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన కింద ఈ బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గోవాలోని ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ. 50 లక్షల భీమా కవరేజీని విస్తరించిందని సావంత్ ట్వీట్ చేశారు. కోవిడ్-19 వల్ల గానీ కరోనా వైరస్ సంబంధిత విధుల కారణంగా ప్రమాదవశాత్తు ప్రాణనష్టం కలిగిన ఆరోగ్య కార్యకర్తకు రూ. 50 లక్షల బీమా రక్షణను అందిస్తుందన్నారు. ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జాతీయ విపత్తు నిధి ద్వారా ఈ పథకానికి నిధులు సమకూరుతాయని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.