విమానాల్లో ఫొటోగ్రఫీపై నిషేధం లేదు, డీజీసీఎ
విమాన ప్రయాణికులు ఫ్లైట్లలో ఫోటోలు తీసుకోవచ్చునని, దీనిపై నిషేధం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం క్లారిటీ ఇస్తూ.. సాధారణ ప్రయాణికులు విమానాల్లో..

విమాన ప్రయాణికులు ఫ్లైట్లలో ఫోటోలు తీసుకోవచ్చునని, దీనిపై నిషేధం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం క్లారిటీ ఇస్తూ.. సాధారణ ప్రయాణికులు విమానాల్లో వీడియో, ఫొటోగ్రఫీ తీసుకోవచ్ఛు నని, విమానం టేకాఫ్, లాండింగ్ సమయాల్లో కూడా ఇందుకు బ్యాన్ లేదని వెల్లడించింది. కానీ ఎలాంటి రికార్డింగ్ సాధనాల వినియోగాన్ని అనుమతించబోమని పేర్కొంది. అలాగే ఎయిర్ సేఫ్టీ నిబంధనలను, కోవిడ్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించే ఎవరిపైనయినా చర్య తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు జర్నలిస్టులు, కెమెరామెన్లు కోవిడ్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి విమానంలోనే ‘రచ్ఛ’ చేసిన సంగతి తెలిసిందే.



