కరోనాతో సీపీఐ(ఎం) సీనియర్ నేత కన్నుమూత
తమిళనాడులో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వైరస్ బారినపడ్డారు.
తమిళనాడులో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వైరస్ బారినపడ్డారు. తాజాగా సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కె తంగవేలు(69) ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా కారణంగా తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నాయి. కరోనా సోకడంతో ఇటీవల ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్సకు తంగవేలు శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. 2011-16లో ఆయన తిరుపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన సీపీఐ(ఎం) పార్టీ కోయంబత్తూరు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తంగవేలు మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read :
దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు