AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనాకు మద్దతుగా హైదరాబాద్ లో ధర్నా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మద్దతుగా హైదరాబాద్ లో రాస్తారోఖో నిర్వహించారు శ్రీ రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణి సేన తెలంగాణ శాఖ కార్యకర్తలు. హైదరాబాద్ బేగంబజార్ లో ఆ సంఘం నాయకులు కంగనా కు మద్దతుగా..

కంగనాకు మద్దతుగా హైదరాబాద్ లో ధర్నా
Pardhasaradhi Peri
|

Updated on: Sep 13, 2020 | 6:01 PM

Share

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మద్దతుగా హైదరాబాద్ లో రాస్తారోఖో నిర్వహించారు శ్రీ రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణి సేన తెలంగాణ శాఖ కార్యకర్తలు. హైదరాబాద్ బేగంబజార్ లో ఆ సంఘం నాయకులు కంగనా కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కంగనా పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ నేతలు.. ఆమె పై వివాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రావత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం.. కంగనా పై కక్షపూరితంగా వ్యవరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ప్రభుత్వం వెంటనే కంగనాకు క్షమాపణ చెప్పి.. కూల్చివేసిన ఆమె కార్యాలయాన్ని తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కర్ణి సేన దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని కర్ణిసేన తెలంగాణ శాఖ నేతలు ఠాకూర్ సతీష్ సింగ్, రాజు సింగ్ హెచ్చరించారు. ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ వివాస్పద మృతి పై నటి కంగనా రనౌత్ స్పందిస్తున్న తీరు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కంగనా కు వెన్నుదన్నుగా శ్రీ రాష్ట్రీయ రాజపుత్ కర్ణి సేన దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

Follow Us
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌
బాలయ్య 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే
బాలయ్య 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే