మహిళలకు ‘నో’ టికెట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎలాంటి చార్జ్ చేయమని కేజ్రీవాల్ ప్రకటించారు. అధిక ధరలతో ఇబ్బంది ఎదుర్కొంటోన్న కొంతమంది మహిళా ప్రయాణికులకు ఇకపై అలాంటి బాధ ఉండదని కేజ్రీ పేర్కొన్నారు. అయితే స్థోమత ఉన్నవాళ్లు ఈ సబ్సిడీ తీసుకోకూదంటూ ఆయన విఙ్ఞప్తి చేశారు. ఇక ఏ విధంగా దీన్ని అమలు చేయాలన్న విషయంపై పూర్తి వివరాల కోసం అధికారులకు ఓ వారం సమయం ఇచ్చామని.. రాబోయే […]

మహిళలకు ‘నో’ టికెట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 4:01 PM

ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎలాంటి చార్జ్ చేయమని కేజ్రీవాల్ ప్రకటించారు. అధిక ధరలతో ఇబ్బంది ఎదుర్కొంటోన్న కొంతమంది మహిళా ప్రయాణికులకు ఇకపై అలాంటి బాధ ఉండదని కేజ్రీ పేర్కొన్నారు. అయితే స్థోమత ఉన్నవాళ్లు ఈ సబ్సిడీ తీసుకోకూదంటూ ఆయన విఙ్ఞప్తి చేశారు. ఇక ఏ విధంగా దీన్ని అమలు చేయాలన్న విషయంపై పూర్తి వివరాల కోసం అధికారులకు ఓ వారం సమయం ఇచ్చామని.. రాబోయే 2-3 నెల్లలో దీన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం అమలు విషయంలో ప్రజల సలహాలు కూడా తీసుకుంటామని కేజ్రీవాల్ ప్రకటించారు.