విమానంలో వస్తారు.. ఏటీఎంలు కొల్లగొడతారు..

విమానంలో వస్తారు.. ఏటీఎంలు కొల్లగొడతారు.. అవునూ మీరు వింటున్నది నిజమే.. ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి విశాఖలో ఉన్న ఏటీఎం సెంటర్లలో చోరీ పాల్పడుతోంది ఓ హర్యానా గ్యాంగ్‌. స్మార్ట్‌గా బ్యాంక్‌ల నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న వీరిని వల పన్ని పట్టుకున్నారు విశాఖ పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా ఏటీఎం కార్డులను, నగదును స్వాధీనం చేసుకున్నారు.

విమానంలో వస్తారు.. ఏటీఎంలు కొల్లగొడతారు..
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 24, 2020 | 1:26 PM

విమానంలో వస్తారు.. ఏటీఎంలు కొల్లగొడతారు.. అవునూ మీరు వింటున్నది నిజమే.. ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి విశాఖలో ఉన్న ఏటీఎం సెంటర్లలో చోరీ పాల్పడుతోంది ఓ హర్యానా గ్యాంగ్‌. స్మార్ట్‌గా బ్యాంక్‌ల నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న వీరిని వల పన్ని పట్టుకున్నారు విశాఖ పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా ఏటీఎం కార్డులను, నగదును స్వాధీనం చేసుకున్నారు.

హర్యానాకు చెందిన అకిబ్‌ఖాన్‌, ముబారక్‌ అనే ఇద్దరు స్నేహితులు ఏటీఎం కార్డులను ఉపయోగించి, చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎం సెంటర్ల దగ్గర గిమ్మిక్కులు చేస్తూ నగదు విత్‌డ్రా చేసుకుని బ్యాంక్‌లను బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం మెషిన్‌లో కార్డు పెట్టి.. డబ్బులు రాగానే ఏటీఎం సెంటర్‌లో ఉన్న పవర్‌ను ఆఫ్‌ చేస్తున్నారు. దీంతో డబ్బులు తీసుకున్నా.. ఏటీఎం మెషిన్‌లో ఎర్రర్‌ చూపిస్తుంది. దీంతో ఇటు డబ్బులు తీసుకుని బ్యాంక్‌లను బురిడీ కొట్టిస్తున్నారు..ఈ స్మార్ట్‌ కేటుగాళ్లు. విశాఖలో వరుసగా జరుగుతున్న ఎటీఎం దొంగతనాలపై పోలీసులు ఓ కన్నేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. దీంతో కిలాడీల గుట్టురట్టైంది.

పక్కా ప్లాన్‌ ప్రకారం రంగంలోకి దిగుతారు స్మార్ట్‌ కేటుగాళ్లు. ముందుగా విశాఖలో ఓ లాడ్జిలో బస చేసి, ఓ బైక్‌ను రెంట్‌కు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ బైక్‌ మీద తిరుగుతూ సెక్యూరిటీ గార్డ్‌ లేని ఏటీఎం సెంటర్లను టార్గెట్‌ చేస్తారు. విశాఖలోని బిర్లా కూడలి దగ్గరున్న ఓ ఏటీఎం కేంద్రంలో గత జూలై 7,8 తేదీల్లో ఏకంగా లక్షా 3 వేలు చోరీ చేశారు. ఆ తర్వాత అదే నెల జూలై 22వ తేదీన 19 వేల చొప్పున రెండుసార్లు డ్రా చేసి పారిపోయారు. అయితే ఎట్టకేలకు ఈ కేటుగాళ్లను పట్టుకున్నారు విశాఖ పోలీసులు. వారి దగ్గరి నుంచి 76 వేల నగదు, 34 బ్యాంకు ఏటీఎం కార్డులు, 3 ఏటీఎం నకిలీ తాళాలు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.