వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వర్డింగ్ చేస్తున్నారా.. అయితే..?

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సోషల్ మీడియాను యూజ్ చేస్తున్న వారు ఎక్కువైపోతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్ వంటి యాప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాగే ప్రతిరోజు వాట్సాప్‌లో వేల మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే కొంతమంది వాటిని చూడకుండానే ఫార్వర్డ్ చేస్తుంటారు. ఒక పోస్టును మీరు ఫార్వార్డ్ చేశారంటే.. ఆ పోస్టును మీరు సమర్ధిస్తున్నారని అర్ధం. కాబట్టి రాజకీయ, మతపరమైన ఆమోదాలు లేదా వైద్య సలహాలు ఉన్న ఎదైనా పోస్టును ఫార్వార్డ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. తప్పుడు […]

వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వర్డింగ్ చేస్తున్నారా.. అయితే..?
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2019 | 11:27 AM

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సోషల్ మీడియాను యూజ్ చేస్తున్న వారు ఎక్కువైపోతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్ వంటి యాప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాగే ప్రతిరోజు వాట్సాప్‌లో వేల మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే కొంతమంది వాటిని చూడకుండానే ఫార్వర్డ్ చేస్తుంటారు. ఒక పోస్టును మీరు ఫార్వార్డ్ చేశారంటే.. ఆ పోస్టును మీరు సమర్ధిస్తున్నారని అర్ధం. కాబట్టి రాజకీయ, మతపరమైన ఆమోదాలు లేదా వైద్య సలహాలు ఉన్న ఎదైనా పోస్టును ఫార్వార్డ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. తప్పుడు మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

కొద్ది నెలల కిత్రం బీజేపీ నాయకుడు ఎస్ వి శేఖర్ ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. మహిళా జర్నలిస్టులకు సంబంధించిన ఓ అసభ్యకరమైన ఫేస్ బుక్ పోస్టును షేర్ చేసినందుకు ఆయన పై కేసు నమోదైంది. అంతేకాదు ఒక ప్రముఖ నాయకుడి స్థానంలో ఉన్న అతడు తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేయడం సమాజానికి తప్పుడు మెసేజ్ ఇవ్వడం లాంటిదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.

Latest Articles