మాజీ మంత్రి ముత్యంరెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం […]

మాజీ మంత్రి ముత్యంరెడ్డి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 9:23 AM

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం దురదృష్టం అని కేసీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్‌తో ముత్యం రెడ్డికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ తర్వాత పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. అలాగే ముత్యం రెడ్డి ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో.. నిరాశ చెందిన ఆయన ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు