Lifestyle: ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు, చుండ్రు సమస్య దరిచేరదు..
బట్టతల సమస్య రావడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు ఒకటి. తలలో దురద, జుట్టు రాలడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం, షాంపూతో తలస్నానం చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టులో చుండ్రు వస్తుంది. జుట్టు రాలడం తగ్గాలంటే...

ప్రస్తుతం చాలా మంది చుండ్రు, జట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యలను అధిగమించడానికి మార్కెట్లో లభించే రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. అయితే అలా కాకుండా సహజ పద్ధతుల ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చుండ్రు, బట్టతల సమస్య దరిచేరకుండా ఉండాలంటే పాటించాల్సిన సహజ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బట్టతల సమస్య రావడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు ఒకటి. తలలో దురద, జుట్టు రాలడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం, షాంపూతో తలస్నానం చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టులో చుండ్రు వస్తుంది. జుట్టు రాలడం తగ్గాలంటే ముందుగా చుండ్రును వదిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.
ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినిరల్స్‌ను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అలాగే జుట్టును మరీ వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నూనె, అలోవెరా జెల్, ఉసిరి రసం వంటి సహజ నివారణలు కూడా జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణంగా చెప్పొచ్చు. కాబట్టి యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
అలాగే క్రమం తప్పకుండా తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణంగా చెబుతున్నారు. కాబట్టి ప్రతీరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలని సూచిస్తున్నారు. వీటితో పాటు జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు ముఖ్యంగా తలను నిత్యం శుభ్రంగాఉ ంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే స్మోకింగ్ శరీరంలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




