AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. విద్యార్థితో అఫైర్! క్లాస్ రూమ్‌లోనే.. ఛీ.. ఛీ..

అమెరికాలోని ఫ్లోరిడాలో 17 ఏళ్ల విద్యార్థితో అనుచిత సంబంధం పెట్టుకున్న 37 ఏళ్ల మహిళా టీచర్ హీథర్ మాష్‌బర్న్ స్మిత్‌కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు తర్వాత మరో 15 ఏళ్ల పాటు పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది. పాఠశాలలోనే అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆమె నేరాన్ని అంగీకరించింది.

పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. విద్యార్థితో అఫైర్! క్లాస్ రూమ్‌లోనే.. ఛీ.. ఛీ..
Florida Teacher Heather Mas
SN Pasha
|

Updated on: Aug 30, 2026 | 9:00 PM

Share

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళా టీచర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. 17 ఏళ్ల మైనర్ విద్యార్థితో అనుచిత సంబంధం పెట్టుకున్న కేసులో 37 ఏళ్ల హీథర్ మాష్‌బర్న్ స్మిత్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తైన తర్వాత మరో 15 ఏళ్ల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

విద్యార్థితో పాఠశాలలోనే..

హీథర్ మాష్‌బర్న్ స్మిత్ ఫ్లోరిడాలోని పోర్ట్ షార్లెట్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. అదే పాఠశాలలో చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థితో ఆమె అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థితో ఆమె అనుచిత సంబంధానికి సంబంధించిన ఘటనలు జరిగినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో పోలీసులు గత ఏప్రిల్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఆమె తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అనంతరం కోర్టు కేసు వివరాలను పరిశీలించి ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 15 ఏళ్ల పర్యవేక్షణ విధించింది.

ఈ ఘటనపై పోర్ట్ షార్లెట్ హైస్కూల్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొంది. టీచర్‌-విద్యార్థి మధ్య ఉండాల్సిన వృత్తిపరమైన హద్దులను ఉల్లంఘించడం వల్ల విద్యార్థులపై తీవ్ర మానసిక, సామాజిక ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ కేసు నేపథ్యంలో మైనర్ విద్యార్థుల భద్రత, పాఠశాలల్లో ఉపాధ్యాయుల ప్రవర్తనా నియమాలు, విద్యార్థులతో వారి సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.

అమెరికాలో ఇలాంటి కేసులపై ఆందోళన

అమెరికాలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుచిత సంబంధాలకు సంబంధించిన కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2014 నుంచి 2019 మధ్య ఇలాంటి కేసులు సుమారు 500 నమోదవగా, 2023లోనే 350 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నైతికతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ విస్తరించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. మైనర్ విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు వృత్తిపరమైన పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Follow Us
విద్యార్థితో లేడీ టీచర్ అఫైర్! క్లాస్ రూమ్‌లోనే..
విద్యార్థితో లేడీ టీచర్ అఫైర్! క్లాస్ రూమ్‌లోనే..
ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందా? ఇది శుభమా.. అశుభమా?
ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందా? ఇది శుభమా.. అశుభమా?
గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
బంగారం ధరలు మరింత పతనమయ్యే ఛాన్స్.. ఇదే సరైన సమయమా..?
బంగారం ధరలు మరింత పతనమయ్యే ఛాన్స్.. ఇదే సరైన సమయమా..?
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..