ఈ-పాస్‌పోర్ట్ మీరు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ ద్వారా మీ పేరు, ఫోటో, ఫింగర్ ప్రింట్‌తో పాటు ఇతర బయోమెట్రిక్ సమాచారం తెలుసుకోవచ్చు.
పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ను సందర్శించి కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు ఆనే ఆప్షన్ ఎంచుకోండి. అనంతరం అవసరమైన వివరాలు నమోదు చేయండి.
వివరాలు అన్నీ జాగ్రత్తగా నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి. అనంతరం ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. అక్కడ మీ బయోమెట్రిక్, ఫోటో ధృవీకరణ నిర్వహిస్తారు.
అపాయింట్‌మెంట్ రోజున అవసరమైన పత్రాలతో పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లండి. అక్కడ మీ వేలిముద్రలు, ఫోటో, ఇతర సమాచారాన్ని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ధృవీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
పాస్‌పోర్ట్ కార్యాలయం మీ పత్రాలను పరిశీలిస్తుంది. పోలీసు వెరిఫికేషన్ తర్వాత మీ దరఖాస్తును ఆమోదిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇ-పాస్‌పోర్ట్ జారీ చేస్తారు.
పాస్ పోర్ట్‌ను పోస్ట్ ద్వారా అడ్రస్‌కు డోర్ డెలివరీ చేస్తారు. దీనిలో ఎలక్ట్రానిక్ చిప్, సంతకం వంటివి ఉంటాయి.
చిప్‌లో ఉండే సమాచారం వల్ల మీ పాస్‌పోర్ట్‌ను తెరవకుండానే మీ వివరాలను అధికారులు చూడవచ్చు. ట్యాంపర్-ప్రూఫ్ వల్ల పాస్ పోర్ట్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.