విదుర నీతి.. ఈ లక్షణాలు మీలో ఉంటే జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదట!

30 August  2026

Rajashekher

ప్రతి ఒక్కరికీ తెలివితేటలు ఉంటాయి. అయితే వాటిని సరైన సమయంలో, సరైన విధంగా ఉపయోగించే వారే జీవితంలో విజయాన్ని సాధిస్తారని విదుర నీతి చెబుతుంది.

సమయస్ఫూర్తితో తెలివితేటలను..

మనకు సమాజంలో లభించే గౌరవం మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఆలోచించి, సందర్భానుసారంగా మాట్లాడే వ్యక్తులను అందరూ ఇష్టపడటమే కాకుండా గౌరవిస్తారు. 

ఆచితూచి మాట్లాడటం..

తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి జీవితంలో అనేక విషయాల్లో విజయం సాధిస్తాడు. అలాంటి వ్యక్తికి ఎక్కడైనా గౌరవం లభిస్తుందని విదురుడు పేర్కొన్నాడు.

ఇంద్రియాలపై నియంత్రణ..

జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ తన జ్ఞానాన్ని అవసరమైన సందర్భాల్లో ఇతరులతో పంచుకుంటూ, అవసరమైన వారికి మార్గదర్శకత్వం చేసే వారికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

జ్ఞానాన్ని అవసరమైన వారికి పంచడం

ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం, శక్తి ఉంటాయి. అయితే సరైన సమయంలో నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తులకు సమాజంలో గౌరవం లభిస్తుందని విదుర నీతి చెబుతుంది.

నిజాన్ని ధైర్యంగా చెప్పడం

మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా వ్యవహరించే వ్యక్తుల పరిపక్వత బయటపడుతుంది. అలాంటి వారికి సమాజంలో గౌరవం లభిస్తుందని విదురుడు సూచించాడు. 

పరిస్థితులకు అనుగుణంగా..

దానధర్మాలు చేయడం, సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు సహకారం అందించడం వంటి మంచి లక్షణాలు ఉన్నవారికి గౌరవం, కీర్తి లభిస్తాయని విదుర నీతి చెబుతుంది. 

దానధర్మాలు, సమాజ సేవ చేయడం

అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తులకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇతరులకు అండగా నిలిచే వారికి ప్రజల మద్దతు కూడా లభిస్తుందని విదుర నీతి సూచిస్తుంది. 

ఇతరులకు సహాయం చేయడం