AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? మొబైల్ ద్వారానే పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. సులువుగా ఇలా..

ఈపీఎఫ్ఓ పెన్షన్ స్టేటస్ మీరు మొబైల్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది. పీపీవో నెంబర్, ఆఫీస్ ఐడీ నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే సులువుగా ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? మొబైల్ ద్వారానే పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. సులువుగా ఇలా..
Epfo
Venkatrao Lella
|

Updated on: Aug 30, 2026 | 8:20 PM

Share

ప్రైవేట్ సంస్ధల్లో ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ ఉనేది ఉంటుంది. మీ జీతం నుంచి 12 శాతం సొమ్మును కట్ చేసి ఇందులో జమ చేస్తారు. ఇక ఇందుకు సరిసమానంగా కంపెనీ కూడా అంతే మొత్తంలో జమ చేస్తోంది. ఉద్యోగి తమ డబ్బులు పొదుపు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల ఆర్ధిక భద్రత కూడా లభిస్తుంది. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఆర్ధిక సంవత్సరం వడ్డీ అందిస్తూ ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది పీఎఫ్ బ్యాలెన్స్‌ను ప్రతీ ఏడాది మరింత పెంచుతూ ఉంటుంది. అలాగే పీఎఫ్ ఖాతాదారులకు జీవిత బీమా సదుపాయం కూడా అమల్లో ఉంది.

పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే రూ.7 లక్షల వరకు కుటుంబానికి లేదా నామినీకి బీమా సొమ్ము అందుతుంది. ఉద్యోగి కుటుంబానికి ఇది ఆర్ధిక భద్రతను కల్పిస్తుంది. దీంతో పాటు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ప్రతీ నెలా ఈ పెన్షన్ సొమ్ము జమ అవుతూ ఉంటుంది. మీ జీతానికి తగ్గట్లు ఈ పెన్షన్ లెక్కించి జమ చేస్తారు. మీరు ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించాక లేదా 58 ఏళ్లు నిండాక ప్రతీ నెలా పెన్షన్ పొందవచ్చు. అయితే కనీసం 10 ఏళ్ల సర్వీస్ పీరియడ్ కంప్లీట్ చేసి ఉండాలి. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయకపోతే నెలనెలా పించన్ అందదు.

ఆన్‌లైన్‌లో పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

-పీఎఫ్ అధికారిక పోర్టల్ https://www.epfo.gov.in/ సందర్శించాలి

-హోమ్ పేజీలో పైన కనిపించే పెన్షనర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-అందులో లాగిన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-ఆ తర్వాత Know Your Pension Status అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-మీ పెన్షన్ డాక్యుమెంట్స్‌లో కనిపించే PPO నంబర్, ఆఫీస్ కోడ్ , ఆఫీస్ ఐడీని ఎంటర్ చేయాలి

-ఆ తర్వాత గెట్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి

-ఆ తర్వాత మీ పేమెంట్ వివరాలు, క్రెడిట్ అయిన తేదీలు, ప్రాసెసింగ్ స్టేటస్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

ఉమాంగ్ యాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలి..?

ఇక ఉమాంగ్ యాప్ ద్వారా కూడా సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా ఉమాంగ్ యాప్ తెరిచి ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. అనంతరం పెన్షన్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆఫీస్ ఐడీ, పీపీవో నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995′ కింద పెన్షన్ పథకాన్ని ఈపీఎఫ్ఓ అమలు చేస్తోంది. కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ఓ నడుస్తూ ఉంటుంది. ఈ పెన్షన్ సొమ్మును నెలాఖరులో జమ చేస్తారు. మీరు ఎంచుకున్న బ్యాంక్ ద్వారా వీటిని పొందవచ్చు. నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతీ నెలా జమ అవుతాయి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల