AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్‌ కాల్ చేయండి

మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడేందుకు చాలామంది ఇప్పటికీ సంకోచిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం అందిస్తున్న Tele-MANAS సేవలు ఎంతో మందికి తొలి అడుగుగా నిలుస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన టెలీమానస్ సేవలు పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చు..

టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్‌ కాల్ చేయండి
Tele Manas Telangana
Srilakshmi C
|

Updated on: Aug 30, 2026 | 8:19 PM

Share

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా, గోప్యంగా కౌన్సెలింగ్ అందించేందుకు టెలీ-మానస్ (Tele-MANAS) సేవలు కీలకంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ టెలీ-మెంటల్ హెల్త్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఫోన్‌ ద్వారా మానసిక ఆరోగ్య సహాయం పొందే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడేందుకు చాలామంది ఇప్పటికీ సంకోచిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం అందిస్తున్న Tele-MANAS సేవలు ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందిస్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో టెలీ మానస్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

14416కు కాల్ చేస్తే..

మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భావోద్వేగ సమస్యలు లేదా ఇతర మానసిక ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురైనప్పుడు 14416కు కాల్ చేయవచ్చు. 1800-89-14416 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా టెలీ-మానస్ సేవలను పొందవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన అధికారిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సేవలు అందుబాటులో ఉండటం వల్ల స్థానిక భాషలోనే తమ సమస్యను వివరించే అవకాశం ఉంటుంది. టెలీ-మానస్ ద్వారా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రాథమిక కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం పొందవచ్చు. వ్యక్తిగత ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భావోద్వేగ ఇబ్బందులు వంటి సమస్యలతో పాటు తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో అవసరమైన తదుపరి వైద్య సహాయానికి రిఫరల్‌ కూడా అందించే వ్యవస్థ ఉంది. ఫోన్‌లో మాట్లాడే కౌన్సెలర్‌ అవసరాన్ని అంచనా వేసి, పరిస్థితిని బట్టి తదుపరి మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అవసరమైతే తగిన వైద్య సేవలకు రిఫర్ చేయవచ్చు. దీంతో ప్రతి సమస్యకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొదటి దశలో సహాయం పొందే అవకాశం ఏర్పడుతుంది.

గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఉపయోగకరం

మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో టెలీ-మానస్ వంటి సేవలు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ప్రయాణం చేయలేని వారు లేదా నేరుగా ఆసుపత్రికి వెళ్లేందుకు సంకోచించే వారు ఫోన్‌ ద్వారా తమ సమస్యను వివరించి సహాయం పొందవచ్చు. మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలు, సామాజిక భయం కారణంగా చాలామంది సమస్యను బయటకు చెప్పకుండా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్‌ ఆధారిత సేవలు మొదటి అడుగుగా ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

గుర్తుంచుకోవాల్సిన నంబర్

  • టెలీ-మానస్ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్: 14416
  • టోల్‌ఫ్రీ ప్రత్యామ్నాయ నంబర్: 1800-89-14416

మానసిక ఆరోగ్య సమస్యలను కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే సీరియస్‌గా తీసుకోవాలి. సమస్యను దాచుకోవడం కంటే సరైన సమయంలో సహాయం కోరడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. టెలీ-మానస్ వంటి సేవలు అవసరమైన వారికి మానసిక ఆరోగ్య సహాయాన్ని మరింత సులభంగా చేరువ చేస్తాయి.

పరీక్షల ఒత్తిడితో బాధపడుతున్న యువతికి అండగా..

రాష్ట్రానికి చెందిన ఓ యువతి పరీక్షల ఒత్తిడి, హార్మోన్ల ప్రభావంతో వస్తున్న శారీరక మార్పులు, వ్యక్తిగత సమస్యలతో పాటు మూడ్‌ స్వింగ్స్‌ వంటి తీవ్రమైన సమస్యలతో Tele-MANASను సంప్రదించింది. ఆమె గతంలో ఓ మానసిక నిపుణుడిని సంప్రదిస్తే.. అతను సూచించిన మందులకు మతిమరుపు భారీన పడింది. ఎవ్వరినీ నమ్మలేని స్థితిలో ఉన్న ఆమెకు టెలీ మానస్‌ కౌన్సెలర్‌ దాదాపు 2 నెలలపాటు వివిధ సెషన్లుగా కౌన్సెలింగ్‌ అందించారు. అంతేకాకుండా తదుపరి స్థాయి మానసిక ఆరోగ్య సేవలకు సమీపంలోని ఇండియన్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదించాలని రిఫర్ చేశారు. కుటుంబంలో మానసిక ఆరోగ్య సమస్యలపై ఉన్న అపోహలను కూడా కౌన్సెలర్ తొలగించే ప్రయత్నం చేశారు. తదుపరి చికిత్స కొనసాగించడంతో యువతికి తన పరిస్థితిపై అవగాహన పెరిగింది. Tele-MANAS అందించిన నిరంతర మద్దతుకు ఆమె కృతజ్ఞతలు తెలిపినట్లు ఓ అధికారిక నివేదిక పేర్కొంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాTele-MANAS ద్వారా సహాయం పొందిన పలువురి అనుభవాలను కేస్ స్టడీల రూపంలో అందుబాటులో ఉన్నాయి.

Follow Us
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌
డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌