బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:23 pm, Fri, 23 October 20
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ఏరియాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.  రాజ్యలక్ష్మి బాణసంచా కర్మాగారంలో  ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. దీపావళి పండగ దగ్గర్లో ఉన్న నేపథ్యంలో వివిధ రకాల బాణాసంచా తయారీలో దాదాపు 50 మంది కార్మికులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్స్ అక్కడి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో విరుదునగర్‌ గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందితున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది.  ఫ్యాక్టరీ ఓనర్‌పై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. పరిశ్రమలో రసాయనాల కారణంగానే మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Also Read :

( కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి )

( హెడ్‌మాస్టార్ దారితప్పాడు..సర్టిఫికేట్ కోసం లంచం )