టాలీవుడ్ పరిశ్రమకు సీఎం కేసీఆర్ బూస్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో వరాల జల్లు.. ట్వీట్టర్ వేదిక సినీవర్గాల ప్రశంసలు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సీఏం కేసీఆర్‌ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు.

టాలీవుడ్ పరిశ్రమకు సీఎం కేసీఆర్ బూస్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో వరాల జల్లు.. ట్వీట్టర్ వేదిక సినీవర్గాల ప్రశంసలు..
Follow us

|

Updated on: Nov 23, 2020 | 10:28 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సీఏం కేసీఆర్‌ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. కరోనా కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమకు రాయితీలను ప్రకటించారు. ఖచ్చితంగా సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలుపుతూ.. కొన్ని రాయితీలు ఇవ్వడమే కాకుండా.. థియేటర్లు ఓపెన్‌ చేసుకోవడానికి వీలుగా జీవోని కూడా విడుదల చేశారు. దీంతో టాలీవుడ్ సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. కొవిడ్ తో ఉపిరి లేకుండ ఉన్న సినీరంగానికి ఇదే పెద్ద బూస్ట్ అని కొనియాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. టాలీవుడ్‌కి కల్పించిన రాయితీలకు గానూ మెగాస్టార్‌ చిరంజీవితో సహా సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసలజల్లు కురిపించారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ నేతృత్వంలో.. ఆయన విజన్‌కి తగినట్లుగా.. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోని మొదటి స్థానాన్ని పొందతుందనే విశ్వాసం తమకి ఉన్నట్లుగా చిరంజీవి తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

చిరు ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేసిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, నిఖిల్ తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాలతో త్వరలోనే తెలుగు సినిమా పరిశ్రమ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లుగా విశ్వసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున చీకటిలో ఉన్న సినీ పరిశ్రమ సీఎం కేసీఆర్ నిర్ణయం వెలుగులు నింపిందంటూ ట్వీట్ చేశారు. అటు, విక్టరీ వెంకటేష్‌, మెగాహీరోలు సాయి తేజ్‌, వరుణ్‌ తేజ్‌ వంటి వారు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

సీఎం కేసీఆర్ మద్దతు తప్పనిసరిగా పరిశ్రమను పునరుత్థానం చేస్తుంది. లక్షలాది జీవనోపాధిని పొందుతున్న సినీ కార్మికులతో పాటు మిలియన్ల మంది సినీ ప్రేమికులకు వినోదాన్ని అందించడంలో మాకు సహాయపడుతుందని సినీ ప్రముఖులు కొనియాడారు.సెలబ్రిటీలందరూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంచెం ఆలస్యమైనా కేసీఆర్‌ దివాళి కానుక ఇచ్చారని ట్వీట్‌ చేశారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఈ సందర్భంగా ఆయన ఓ లెటర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేయడమే కాకుండా.. సీఎం కేసీఆర్‌ టాలీవుడ్‌ కోసం నిలబడ్డారని చాటారు.

టాలీవుడ్‌ పరిశ్రమ కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటోంది. సెలబ్రిటీలందరూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంచెం ఆలస్యమైనా కేసీఆర్‌ దివాళి కానుక ఇచ్చారని ట్వీట్‌ చేశారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఈ సందర్భంగా ఆయన ఓ లెటర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేయడమే కాకుండా.. సీఎం కేసీఆర్‌ టాలీవుడ్‌ కోసం నిలబడ్డారని చాటారు. సీఎం కేసీఆర్ చూపిస్తున్న ఆదరణను ఎప్పటికి మరిచిపోలేమంటున్న సినీ ప్రముఖులు త్వరలోనే ఆయన్ను ఘనంగా సత్కరించుకుంటామన్నారు.