AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్‌ షూటర్‌..తనదైన స్టయిల్లో పని మొదలు పెట్టాడు

ఓటమి ఎరుగని ట్రబుల్‌ షూటర్‌ రగిలిపోతున్నాడు. ప్రతీకారం కోసం కసిగా పనిచేస్తున్నాడు. ఆయనే టీఆర్‌ఎస్‌ నేత, ఆర్థికమంత్రి హరీష్‌రావు. దుబ్బాకలో కారును దెబ్బతీసిన బీజేపీని- గ్రేటర్‌ ఎన్నికల్లో దెబ్బకుదెబ్బ తీయాలని ఆర్థికమంత్రి హరీష్‌రావు పట్టుదలతో ఉన్నారు...

మళ్లీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్‌ షూటర్‌..తనదైన స్టయిల్లో పని మొదలు పెట్టాడు
Sanjay Kasula
|

Updated on: Nov 23, 2020 | 9:52 PM

Share

Minister Harish Rao Entry : టీఆర్‌ఎస్‌ పుట్టినప్పటినుంచి కేసీఆర్‌ వెన్నంట నిలిచి, ఆ పార్టీ మూలస్తంభాల్లో ఒకరైన హరీష్‌రావుకు రాజకీయ జీవితంలో ఓడిపోవడం తెలియని నాయకుడు. అలాంటి హరీష్‌రావును దుబ్బాక ఓటమి కుదుపు కుదిపింది.

దుబ్బాక ఓటమిని మైండ్‌ నుంచి తీసేయాలని కేసీఆర్‌ చెప్పిన నేపథ్యంలో- ఈ ట్రబుల్‌ షూటర్‌ మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో- సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లు ఉన్నాయి. పటాన్‌చెరు, భరత్‌నగర్‌, రామచంద్రాపురంలో ఆర్థికమంత్రి హరీష్‌రావు- టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం తనదైన స్టయిల్లో పనిచేస్తున్నారు.

టికెట్లు ఆశించి భంగపడ్డవారు- బీజేపీలోకి వెళ్లకుండా బుజ్జగిస్తున్నారు. బీజేపీలో చేరిన ఒక సిట్టింగ్‌ కార్పొరేటర్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరేలా సక్సెస్‌ అయ్యారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వని బీజేపీ- హైదరాబాద్‌లో అడ్డం పొడవూ మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలో పనిచేసేందుకు- గజ్వేల్‌, ఆందోల్‌, సిద్దిపేట, సంగారెడ్డి నియోజకవర్గాల నేతల సేవలను ఉపయోగించుకుంటున్నారు. దుబ్బాక పరాజయంతో నేర్చుకున్న పాఠాలను గుర్తించుకుని- గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించాలని హరీష్‌రావు గట్టి సంకల్పంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హరీష్‌ ప్రచారం చేస్తున్నచోట- బీజేపీ సాధించే ఓట్లెన్ని అన్న పాయింట్‌ ఇంట్రస్టింగ్‌గా మారింది.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..