మతంపేరిట ఉద్వేగాలు రెచ్చగొట్టడమే వారికి తెలిసిన విద్య.. ఆలోచించండి.. పి అండ్ టి కాలనీ చౌరస్తా రోడ్ షోలో కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం: ఆర్కేపురం అష్టలక్ష్మీ పురం చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో

మతంపేరిట ఉద్వేగాలు రెచ్చగొట్టడమే వారికి తెలిసిన విద్య.. ఆలోచించండి.. పి అండ్ టి కాలనీ చౌరస్తా రోడ్ షోలో కేటీఆర్
Follow us

|

Updated on: Nov 24, 2020 | 11:42 AM

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా మూడో రోజూ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  ఈ సాయంత్రం ఎల్బీనగర్ సర్కిల్ లోని ఆర్కేపురం అష్టలక్ష్మీ చౌరస్తా, మన్సూరాబాద్ బిగ్ బజార్ చౌరస్తా, వనస్థలిపురం రైతుబజార్ చౌరస్తా, పి అండ్ టి కాలనీ చౌరస్తా లలో రోడ్ షోలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99 సీట్లు ఇచ్చి హైదరాబాద్ ప్రజలు గత ఎన్నికల్లో గెలిపించారు. ఈ ఐదేళ్ల ఎంతో అభివృద్ధి చేసి చూపించి మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు.. వచ్చామని కేటీఆర్ అన్నారు. నీళ్లు, కరెంటు, మెట్రో పరుగులు నగరంలో పెట్టిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అప్పటి సీఎం కిరణ్ కుమర్ రెడ్డి, తెలంగాణ వస్తే హైదరాబాద్ అతలాకుతలం అయిపోతుందని భయపెట్టారని ఇప్పుడు ఏమైందని ఆయన అడిగారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని గండిపేట రిజర్వాయర్ ను తలదన్నే రీతిలో హైదరాబాద్ ప్రజలకు తాగు నీటిని ఇచ్చే కేశవాపురం రిజర్వాయర్ కడుతున్న ముందు చూపున్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు.

ఈ ఆరేళ్లలో పేదవాడికి ఐదురూపాయలకే అన్నం పెట్టినం, బస్తీ బస్తీలో దావఖానాలు పెట్టినం అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు అన్నది మనం ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గులాబీలు కావాలా, గుజరాత్ గులాంలు కావాల్నా ఆలోచించండి అని కేటీఆర్ అన్నారు.