తెలంగాణ కాంగ్రెస్‌లో క్యాస్ట్ కలహం

మునిసిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులం పేరిట కలహాలు ముదురుతున్నాయి. టీపీసీసీపై రెడ్డిల పెత్తనం కొనసాగుతోందంటూ బీసీ వర్గాలు ఏఐసీసీకి తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. రెడ్డీల పెత్తనం కారణంగా పార్టీకి బలహీన వర్గాలు దూరమవుతున్నాయని భావిస్తున్న కొందరు నేతలు ఈసారి టీపీసీసీ పగ్గాలు బీసీ వర్గాలకే ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు ఏదో ఒక పోస్టు దక్కుతున్నా.. పెత్తనం మాత్రం రెడ్డీ వర్గాలదే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. దానికి […]

తెలంగాణ కాంగ్రెస్‌లో క్యాస్ట్ కలహం
Follow us

|

Updated on: Jan 02, 2020 | 5:31 PM

మునిసిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులం పేరిట కలహాలు ముదురుతున్నాయి. టీపీసీసీపై రెడ్డిల పెత్తనం కొనసాగుతోందంటూ బీసీ వర్గాలు ఏఐసీసీకి తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. రెడ్డీల పెత్తనం కారణంగా పార్టీకి బలహీన వర్గాలు దూరమవుతున్నాయని భావిస్తున్న కొందరు నేతలు ఈసారి టీపీసీసీ పగ్గాలు బీసీ వర్గాలకే ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు ఏదో ఒక పోస్టు దక్కుతున్నా.. పెత్తనం మాత్రం రెడ్డీ వర్గాలదే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. దానికి తోడు ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఫ్యూచర్‌లో టీపీసీసీ పోస్టు ఆశిస్తున్న జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి… ఇలా ఏ కోణంలో చూసినా ఒకే కులం ఆధిపత్యం కనిపిస్తుంది. అదే సమయంలో టీపీసీసీ పోస్టును మరో అగ్రవర్ణం నేత శ్రీధర్ బాబు ఆశిస్తున్నారు.

ఇలా అగ్రవర్ణాలకే పెత్తనం అప్పగిస్తే పార్టీని బలహీన వర్గాల్లోకి ఎలా తీసుకెళ్తామంటున్నారు బీసీ నేతలు. ఈ కోణంలో ఈసారైనా బీసీలకు తెలంగాణ సారథ్య బాధ్యతలను అప్పగించాలని కోరుతున్న వారి సంఖ్య ఇప్పుడు పార్టీలో పెరిగుతోంది. బీసీ వర్గానికి చెందిన వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ వంటి వారితోపాటు ఎస్సీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా పీసీసీ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరిలో సంపత్ కుమార్ ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వర్కంగ్ ప్రెసిడెంట్‌గా వున్నారు.