మిస్ ఇండియా రన్నరప్‌గా తెలుగమ్మాయి

2019 మిస్ ఇండియా కిరీటం రాజస్థాన్‌కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతమైంది. గతేడాది మిస్ ఇండియా అయిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వ్యాస్ ఆమెకు కిరీటం పెట్టారు. ఇక ఫస్ట్ రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది. తెలంగాణ అమ్మాయి సంజనా విజ్ సెకండ్ రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2018లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు.. ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహూకరించింది. రన్నరప్​ […]

మిస్ ఇండియా రన్నరప్‌గా తెలుగమ్మాయి
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 12:58 PM

2019 మిస్ ఇండియా కిరీటం రాజస్థాన్‌కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతమైంది. గతేడాది మిస్ ఇండియా అయిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వ్యాస్ ఆమెకు కిరీటం పెట్టారు. ఇక ఫస్ట్ రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది. తెలంగాణ అమ్మాయి సంజనా విజ్ సెకండ్ రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2018లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు.. ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహూకరించింది. రన్నరప్​ సంజనా విజ్​కు ఏపీజే అబ్దుల్​ కలాం అంటే అభిమానం. సొంతూరు ఢిల్లీ అయినా అమె కుటుంబం తెలంగాణలో స్థిరపడ్డారు. డాన్స్​, యాక్టింగ్​, బాస్కెట్​బాల్​, షూటింగ్​ అంటే తనకి ఇష్టం. సీఆర్​పీఎఫ్​ పబ్లిక్​ స్కూల్లో ఆమె స్కూలింగ్​ చేశారు. అమిటీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోటెక్నాలజీలో డిగ్రీ పట్టా పొందారు. ముంబైలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది.